Thursday, January 23, 2025

నాపై మీడియా విచారణ ఎక్కువ జరిగింది: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంఎల్‌సి కవిత తెలిపారు. దర్యాప్తు సంస్థలు చెప్పినట్టు తనకు ఆర్థికంగా లబ్ధి చేకూరలేదని, సిబిఐ, ఇడి దర్యాప్తు కంటే మీడియా విచారణ ఎక్కువ జరిగిందని మండిపడ్డారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారని, తన ఫోన్ నంబర్‌ను ఛానళ్లలో ప్రసారం చేసి తన గోప్యతను దెబ్బతీశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే నాలుగు సార్లు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించానని చెప్పారు. మంగళవారంతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌస్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు ఆమెను ఇడి అధికారులు హాజరుపరిచారు.  ఎంఎల్‌సి కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 23 వరకు పొడిగించడంతో ఆమె మీడియాతో మాట్లాడారు.

తన మొబైల్ ఫోన్లు అన్నీ దర్యాప్తు సంస్థకు అందజేశామని, ఫోన్లు ధ్వంసం చేశానని, తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హితువు పలికారు. రెండున్నర ఏళ్లుగా సోదాలు జరిపారని, వేధింపులకు గురి చేశారని, సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్నారని, బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు. 95 శాతం కేసులన్నీ ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే ఉన్నాయని, బిజెపిలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందని ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ వైపు ఆశతో ఎదురు చూస్తున్నాయని, కేసు దర్యాప్తునకు సహకరించేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని, ఈ పరిస్థితులో బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నానని, తన చిన్న కుమారుడి పరీక్షలకు తల్లిగా తనతో ఉండాలని అనుకున్నానని, తాను లేకుంటే తన కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడవచ్చని, తన బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నానని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News