Monday, December 23, 2024

కమల వికాసం ఖాయం

- Advertisement -
- Advertisement -

తూఫ్రాన్, నిర్మల్ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ

మన తెలంగాణ/తూప్రాన్/మెదక్ ప్రతినిధి/నిర్మ ల్ ప్రతినిధి: గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నా యా.. దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించి బిజెపికి పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొని నరేంద్రమోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికలో ట్రైలర్‌గా చూపించామని, ఇ ప్పుడు రాష్ట్రమంతా చూపించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అసమర్థ కాంగ్రెస్ ప్రభు త్వం పాలించడం వల్లనే దేశ ప్రజలు 2014లో బో ఫోర్స్ నుంచి హెలికాప్టర్ కొనుగోలు వరకు అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కకు జరిపి సమర్థవంతమైన బిజెపి పార్టీకి అధికారాన్ని ఇచ్చారని చెప్పారు. బిజెపి ప్రభుత్వం ప్రజలకు గౌరవప్రదమైన సుపరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు. కాం గ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా ప్రజా వ్యతిరేకత కు భయపడి అమేథీని వదిలి వారణాసిలో పోటీ చేశారని తెలిపారు. తెలంగాణలో బిజెపికి అధికారమిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని

మోడీ తెలిపారు. బిజెపి వల్లనే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందని ప్రధాని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిపాలన సాగించినప్పుడు ఎవరైనా బిసి బిడ్డలు ముఖ్యమంత్రి అయ్యారా అ నేది ప్రజలు ఆలోచించాలని బిజెపి ప్రభుత్వం వస్తే తెలంగాణలో బిసిని చేస్తామని ప్రధాని స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధాన్యం కొనుగోలు ధరను క్వింటాలుకు రూ. 3100 పెంచి ఇస్తామని స్పష్టం చేశా రు. సామాజిక న్యాయం అందించడం బిజెపితోనే సాధ్యమవుతుందని, ఎస్‌సి వర్గీకరణకు తాము క ట్టుబడి ఉన్నామని ఇందుకోసం ఒక కమిటీని కూడా వేశామని ఆయన అన్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సభలో ఏడు నియోజకవర్గాలకు చెందిన గజ్వేల్, సిద్దిపేట,దుబ్బాక, మెదక్, నర్సాపూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన పార్టీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బిజెపి అధికారంలోకి వస్తే నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రపంచ గుర్తింపు తెస్తా: మోడీ
మొదటిసారి బిజెపి పార్టీ అధికారంలోకి రానుందని, అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మల్‌లోని కొయ్య బొమ్మలకు ప్రపంచ గుర్తింపు తెప్పిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరై ప్రసంగించారు. బిజెపి పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేస్తోందని, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల అభివృద్ధ్ది, బలోపేతానికి బిజెపి కృషి చేస్తోందన్నారు. మాదిగల అభివృద్ధి కోసం బిజెపి ముందుకెళ్తుందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రధాన మంత్రిని కాలేదని పేదలకు ఇల్లు కట్టించడానికి ప్రధాన మంత్రి అయ్యాను అన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టించానన్నారు. తెలంగాణలో సైతం ఇల్లు కట్టించడానికి ముందుకొస్తే అడ్డుకుంటున్నారన్నారు. కానీ అంబేద్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. బిజెపి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటుందని పసుపు రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మతం పేరు మీద ఐటి పార్కులు పెడుతామని చెప్పడం చాలా సిగ్గు చేటు అని, ఇది ఓట్ల ఆటని, ఇది భారత రాజ్యాంగానికి ప్రమాదకరమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్నారు . తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి ముందుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ , ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాథోడ్ రామ్‌నాయక్, బిజెపి ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News