Friday, November 22, 2024

జోరుగా చిట్టీల దందా

- Advertisement -
- Advertisement -

కన్నాయిగూడెం: ములుగు జిల్లా ఏజెన్సీ మండలం అయినటువంటి కన్నాయిగూడెంలో చిట్టీల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. మండలంలో ప్రైవేట్ వ్యాపారుల చిట్టీ దందా మితిమీరిపోతుంది. ప్రైవేట్ ఫైనాన్స్‌లు ఇవ్వడమే కాకుండా అనధికార చిట్టీ వ్యాపారాలు కూడా యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకపోయిన ప్రైవేట్ చిట్టీల దందా కొనసాగిస్తున్నారు. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉండాల్సిన కొందరు పెద్ద మనుషుల ముసుగులో చరవాణి ముసుగులో అక్రమ సంపాదనే ధ్యేయంగా చిట్టీల దందా జోరుగా కొనసాగిస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను తుంగలో తొక్కి చిట్స్ ద్వారా ఫైనాన్స్‌ను నడిపిస్తున్నారు. నమ్మకం అనే ముసుగులో ప్రజల నుండి లక్షల రూపాయలను జమ చేసుకుంటున్నారు. కన్నాయిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా జీరో దందా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. డబ్బులు అవ సరమున్న వారికి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.5 నుండి రూ.10 వరకు ము క్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు.

కొంత మంది ఏకంగా ఉద్యో గాలను, ఇతర వ్యాపారాలను పక్కనపెట్టి జీరో దందాలు నడిపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఉన్న చిట్స్ రిజిస్టర్ వద్ద అనుమతి పొందిన వారు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వ్యాపారాన్ని కొనసాగించాలి. కానీ మండలంలో నిబంధనల ప్రకారం వ్యాపారాన్ని కొనసాగించాలి. కానీ మండలంలో అనుమతి లేని ప్రైవేట్ వ్యక్తులు తమకు తెలిసిన వారితో చిట్టీలు వేయించి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిట్స్, రిజిస్ట్రేషన్ అనుమతి లేని చిట్టీలు నడిపిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News