Monday, January 20, 2025

కేంద్రం లౌడ్ స్పీకర్ నియమాలు రూపొందించాలి: ఉద్ధవ్ థాక్రే

- Advertisement -
- Advertisement -

Uddhav Thakrey

ముంబయి: ఆరాధనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన మహారాష్ట్ర అఖిలపక్ష సమావేశం తర్వాత,  దేశవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రూపొందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం ప్రతినిధులను కలవడానికి ప్రతినిధి బృందం వెళ్లనున్నట్లు కూడా తెలిపింది. సమావేశం అనంతరం మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, శివసేన నేత ఆదిత్య థాకరేతో కలిసి మీడియాతో మాట్లాడారు. “దేశమంతటా వర్తించే చట్టాన్ని తీసుకురావాలని మేము కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాము. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూస్తాం’’ అని వాల్సే పాటిల్ అన్నారు.

లౌడ్ స్పీకర్ల వినియోగంపై రాష్ట్రానికి చెందిన ప్రతినిధి బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలని, చర్చలు జరపాలని కూడా సమావేశంలో నిర్ణయించామని థాకరే చెప్పారు. ఇదిలావుండగా మతపరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించలేదని, లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసిన వ్యక్తులు మాత్రమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని వాల్సే-పాటిల్ అన్నారు.

మసీదులలో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని పరిమితం చేయాలని వారు నిర్ణయించుకుంటే, భజనలు, కీర్తనలు, గణపతి ఊరేగింపులు మరియు నవరాత్రుల సమయంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై కూడా దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వాల్సే-పాటిల్ అన్నారు. “వేర్వేరు వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం ప్రత్యేక నియమాలు ఉండకూడదు” అని మహారాష్ట్ర హోం మంత్రి అన్నారు. ఆయన ఇంకా ఇలా తెలిపారు: “శాంతిభద్రతలను కాపాడుకోవడం రాష్ట్ర బాధ్యత. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. సమావేశంలో మా చర్చ ఆధారంగా, సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవడమే ప్రధానం అని అంగీకరించాము.’’

అయితే మసీదుల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్,  మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు అయ్యారు.  కాగా ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో  “సిఎం (ఉద్ధవ్ థాకరే) స్వయంగా అఖిలపక్ష సమావేశానికి హాజరు కానప్పుడు, సమావేశానికి ప్రయోజనం లేదు. ఇది కంటిచూపు మాత్రమే.”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News