Saturday, November 23, 2024

అంధులకు మనోదైర్యం పెంచిన లూయిస్ బ్రెయిలీ: దివ్యదేవరాజన్

- Advertisement -
- Advertisement -

Louis Braille raises spirits of the blind
మన తెలంగాణ,సిటీబ్యూరో: లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని దృష్టి లోపం గలవారు నిరాశ చెందకుండా తమదైన రంగాన్ని ఎంచుకుని వివిధ రంగాలలో ముందుండాలని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి దివ్యదేవరాజన్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వం హోమ్ పర్ విజువలీ చాలెంజెడ్ కళాళాల బాలికల వసతి గృహం తపోవన్ కాలనీ లింగోజిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానకి ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ శర్మన్‌తో కలిసి బ్రెయిలీ చిత్ర పటానికి పూల వేసి నివాళ్లు అర్పించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాతో జనవరి 4న జరపాల్సిన లూయిస్ బ్రెయిలీ జయంతి ని నేడు జరుపుకుంటున్నామన్నారు. అందుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ అని, అంధుల కోసం లిపిని కనిపెట్టి దివ్యాంగుల మనోదైర్యాన్ని పెంచి వారికి బంగారు భవిష్యత్తు కల్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యంగులకు నెలకు రూ. 3016లు అందించడంతో వారికి ఆర్దిక భద్రతా అందిస్తుంది. దివ్యంగులు హాస్టల్స్‌లలో ఉండి బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని ఆమె కోరారు. అనంతరం కలెక్టర్ శర్మన్ ప్రసంగిస్తూ బ్రెయిలీ లేకపోతే అంధులు చీకటిలో మగ్గిపోయేవారిని బ్రెయిలీతో వారి జీవితాలలో వెలుగులు నిండాయన్నారు.

దివ్యంగులు వారిలో నెలకొన్న ఆత్మ న్యూనతా భావాన్ని పారద్రోలి ఆత్మస్దైయిర్యంతో మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. బ్రెయిలీ లిపితో లక్షలాది మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని వెల్లడించారు. అదే విధంగా ఆశాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి అక్షర జ్ఞానం కలిగేలా చేసి చరిత్ర సృష్టించిన వ్యక్తే లూయిస్ బ్రెయిలీ అన్నారు. ప్రభుత్వం దివ్యంగులకు కల్పించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అంధ విద్యార్ధులు ఆలపించిన పాటలు, కోలాటం అందరిని ఆకర్షించాయి. ఈకార్యక్రమంలో స్దానిక కార్పొరేటర్ రాజశేఖర్‌రెడ్డి, దివ్యంగులు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్, మాట్రాన్ స్వప్న, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News