Thursday, December 26, 2024

లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

హృషికేష క్రియేషన్స్, భీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి.శ్రవణ్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను నటుడు మంచు మనోజ్ విడుదల చేశారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ “టీజర్ బాగుంది. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది”అని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ దుబాయ్, కొండమడుగు ఊరిలో షూటింగ్ చేయడం జరిగిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News