Saturday, December 21, 2024

ప్రేమ జంట ఆత్మహత్య… కానీ ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

Love Couple commit suicide in Bapatla

 

అమరావతి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినా సంఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. కర్లపాలెం మండలం చింతాయలపాలెంకు చెందిన యువకుడు, బాపట్లకు చెంది యువతి ప్రేమించుకున్నారు. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి, యువకుడు సోమవారం అర్థరాత్రి మూర్తిరక్షణ రైల్వేగేటుకు సమీపంలో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. బంధువులు మృతదేహాలను వెంటనే తీసుకెళ్లారు. యువతి మృతదేహానికి అదే రాత్రి అంత్యక్రియలు జరపగా మంగళవారం తెల్లవారుజామున యువకుడి అంత్యక్రియలు జరిపారు. పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లి విచారించగా ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు రాలేదు. రైల్వే పోలీసులను వివరణ అడగగా సరైన సమాచారం ఇవ్వలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News