Monday, December 23, 2024

ప్రేమించుకున్నారు…. పెళ్లి చేయలేదని ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Love couple commit suicide in Mahaboobnagar

మహబూబ్‌నగర్: ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మామిడి చెట్టుతండాలో శాంతి(21), శివ(25) గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. శివ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వారు పేళ్లి చేసుకుంటామన్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో శాంతి తన తల్లిదండ్రులతో కలిసి పూణేకు వెళ్లింది. జీవితం తాము ఒక్కటి కాలేమని అనుకున్న శాంతి సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ప్రియుడు శివ షాద్‌నగర్ నుంచి తండాకు వస్తుండగా మార్గం మధ్యలో పురుగులు మందు సేవించాడు. వాహనాదారులు గమనించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. షాద్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. మామిడితండాలో విషాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News