Monday, January 20, 2025

ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి న్యూస్ : ప్రేమించుకున్నారు… పెళ్లి చేసుకోవాలనుకున్నారు… యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో పాటు యువతికి మరో యువకుడితో పెళ్లి చేశారు. దీంతో ప్రియుడితో కలిసి ప్రియురాలి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కృష్ణారావు(21), తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనూష(20) ఓ ఫంక్షన్‌లో ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇద్దరు కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. వెంటనే అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. ప్రేమించిన ప్రేమికుడిని మరిచిపోలేక అమ్మాయి నరకయాతన అనుభవించింది. అత్తింటి నుంచి అమ్మాయి వెళ్లిపోవడంతో ఆమె భర్త పోశిబాబు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనూష, కృష్ణారావు తిరుపతి చేరుకొని లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. రూమ్‌లో నుంచి జంట బయటకు రాకపోవడంతో సిబ్బంది బలవంతంగా డోర్ ఓపెన్ చేశారు. ఇద్దరు ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవులుగా కనిపించారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News