Sunday, December 22, 2024

హైదరాబాద్ శివారులో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Love Couple commits suicide in Hyderabad suburbs

హైదరాబాద్: హైదరాబాద్ శివారులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నగర శివారులోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డులో కుళ్ళిన స్థితిలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పురుగుల మందు బాటిల్, సెల్ ఫోన్లు, టూవీలర్ ను గుర్తించారు. సెల్ ఫోన్, బైకు సహయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతులను నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలెపల్లి గ్రామానికి చెందిన సతీష్, శిరీషలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News