- Advertisement -
చెట్టుకు ఉరి వేసుకొని మృతి
కోస్గి : మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలంలోని అమ్లికుంట గ్రామ శివారులో ప్రేమ జంట ఆత్మహత్య పాల్పడ్డారు. ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అమ్లికుంట గ్రామ శివారులో మాధరి వెంకటయ్యకు చెందిన వ్యవసాయ పొలంలో ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. మృతులు నాగులపల్లి గ్రామం గండీడ్ మండలానికి చెందిన నిషిత, కొడంగల్ మండలం హుస్సేన్‌పూర్ గ్రామానికి చెందిన శివకుమార్‌లుగా గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. పొలం యజమాని మాధరి కేశవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
- Advertisement -