Sunday, December 22, 2024

దళిత యువకుడిని ప్రేమించిందని… పరువు హత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: పరువు హత్య జరిగిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా పదారియా చేట్‌సింగ్ గ్రామంలో జరిగింది. ప్రేమ జంటను దారుణంగా హత్య చేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 18 ఏళ్ల దళిత యువకుడు అంకిత్ ముజిబుల్లా అనే యాజమాని వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ముజిబుల్లా కూతురు అమీనాను దళిత యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఇద్దరిని ముజిబుల్లా మందలించాడు. అమీనా దళిత యువకుడితో ప్రేమాయణం కొనసాగించడంతో ప్రేమ జంటను మరో ఇద్దరు కలిసి ముజిబుల్లా హత్య చేశాడు. అమీనా మృతదేహాన్ని రుధౌలీ ప్రాంతంలోని ఓ చెరుకు తోటలో పాతిపెట్టాడు. పరాస్ నాథ్ అనే వ్యక్తి అంకిత్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News