Monday, December 23, 2024

బైక్‌పై ప్రేమజంట అసభ్యంగా కూర్చొని…

- Advertisement -
- Advertisement -

 

జైపూర్: యువత నడి రోడ్డుపై బైక్‌తో స్టంట్‌లు చేస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ప్రేమికుడు తన ప్రియురాలిని బైక్‌పై అపసవ్య దిశలో కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లోని కాలేజ్ క్రాస్ రోడ్డ నౌసర్ వ్యాలీ రహదారిపై ఓ ప్రేమ జంట బైక్‌పై అసభ్యంగా కూర్చొని ప్రయాణించారు.

దీంతో స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రమాదకర రీతిలో ప్రయాణించడంతో మంచి పద్దతి కాదని హితువు పలికారు. ఇతరులకు ఆటంకం కలిగించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గతంలో ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతాలలో ప్రేమ జంట బైక్ పై కూర్చొని విచ్చలవిడిగా ప్రవర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News