దుబ్బాక: తమ ప్రేమకు పెద్దలు అంగీకరిస్తారో లేదో నన్న ఆందోళన తో తీవ్ర మనస్థాపానికి గురైన ఇద్దరు ప్రేమికులు ఒకే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో చోటు చేసు కుంది. దుబ్బాక ఎస్‌హెచ్‌ఓ బత్తుల మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం…. లచ్చపేటలోని పదో వార్డ్ కౌన్సిలర్ కూ రపాటి బంగారయ్య కుమారు డైన రవికాంత్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. అతని కుమారుడు కూరపాటి భగీరత్ (17) మీ బాలుడు దుబ్బాక లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నా డు. అదే కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న దుబ్బాక పట్టణానికి చెందిన తోట్ల రేణుక వెంకటేశం ల మొదటి కూతురు నేహా (16) అనే బాలికతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరికీ గత రెండు సంవత్సరాలుగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది.
ఈ క్రమంలో బాలుడి విషయం వారి ఇంట్లో తెల య డంతో ఇప్పుడే పెళ్లి వద్దని చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరారు. దీనితో తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరిస్తాయో లేదో ఆందోళనతో గత కొంతకాలంగా ఇద్దరు మైనర్ ప్రేమికులు కలత చెందారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి తన తాత ఇంటి నుండి ద్విచక్ర వాహనంపై దుబ్బాక పట్టణంలోని డబల్ బెడ్ రూమ్ ల వద్ద నివాసం ఉంటున్న బాలిక వద్దకు వచ్చి బాలికను తన తండ్రికి చెందిన ఖాళీగా ఉంటున్న పాత ఇంటిలోకి తీసుకువెళ్లి రెండు చున్నీలతో పక్కపక్కగా ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. జరిగిన ఘటనను గుర్తించిన కుటుంబీకులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన ఘటానికి చేరుకున్న పోలీసులు మృత్ ల శవపరీక్షల నిమిత్తం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు తల్లి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతి చెందిన ఇరువురి కుటుంబాలను మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు పరమార్శించి సానుభూతి వ్యక్తం చేశారు.