Friday, January 24, 2025

ములుగు అడవిలో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Love couple suicide in Mulugu forest

 

ఒకే చెట్టుకి ఉరి వేసుకున్న ప్రేమికులు
ములుగు మండలం అడవి మజీద్‌లో ఘటన

ములుగు: ప్రేమ జంట ఒకే చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లా ములుగు మండల అడవి మజీద్ గ్రామ శివారులో శనివారం జరిగింది. స్థానికులు ప్రేమికుల మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మండల పరిధిలోని మామిడ్యాల్ గ్రామానికి చెందిన గొట్టి మహేష్(29), మర్కుక్‌కు చెందిన స్వప్న(19)లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే 7 సంవత్సరాల క్రితం మహేష్‌కి భావనందపూర్‌కి చెందిన వేరే అమ్మాయితో వివాహం జరిగింది. మహేష్, స్వప్నల ప్రేమ విషయమై కుటుంబీకులు ఇరువురిని మందలించినా వినలేదు. కాగా, ఇరువురిపై గతంలో ఇరు కుటుంబాలు ఫిర్యాదులతో ములుగు, మర్కుక్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ములుగు ఎస్సై రంగకృష్ణ గౌడ్ తెలిపారు. శనివారం ఉదయం మండల పరిధిలోని అడవిమసీద్ శివారు కొండపోచమ్మ జలాశయం సమీపంలోని మహేష్ వ్యవసాయ పొలం వద్ద ఒకే చెట్టుకి మహేష్, స్వప్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఎస్సై తెలిపారు. తాము ఎక్కడ ఉన్న విషయం తెలిసేలా మహేష్ మేనమామకి లొకేషన్ పంపినట్లు ఆయన పేర్కొన్నారు. లొకేషన్ ఆధారంగా వెతగ్గా ఒకే చెట్టుకి మహేష్, స్వప్న మృతదేహాలు వేలాడుతున్నాయని చెప్పారు. ఈ ఘటనతో ఇరువురి కుటుంబాల్లోనూ విషాదం చోటుచేసుకుంది. మహేష్ తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News