Thursday, January 23, 2025

సంగారెడ్డిలో ప్రేమ జంట ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: జిల్లాలోని మునిపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని బుదెర గ్రామ శివారులోని పటేల్ ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం ఓ ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని సిరిపురం, మర్పల్లి మండలాలకు చెందిన బొగ్గుల అమృత కొహిర్, బ్యాగరి శివలు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్నా. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే, తాము తప్పు చేశామని ఇంట్లో చెప్పే ధైర్యం తమకు లేదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Love Couple Suicide in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News