Sunday, January 19, 2025

అందమైన ప్రేమజంట… వాళ్లు చేసిన పని చూస్తే షాక్ కావాల్సిందే..

- Advertisement -
- Advertisement -

లండన్: ఏ ప్రేమజంట అయినా పార్కులు, షాపింగ్‌లకు వెళ్తోంది. ఈ అందమైన ప్రేమజంట మాత్రం విలాసల కోసం దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకుంది. జిమ్‌లో లాకర్ల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల దొంగలించి డబ్బులు డ్రా చేసుకొని ఏంజాయ్ చేసింది. దీంతో ఓ పోలీస్ ఆఫీసర్ నిఘా పెట్టి ఆ ప్రేమ దొంగలను పట్టుకున్న సంఘటన యుకెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆశ్లే సింగ్(39), సోఫీ బ్రూయిన్‌లు(20) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమజంట విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. వీళ్ల దగ్గర డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దొంగతనం చేస్తే చేసినట్టుగా ఉండకుండా వీళ్లు నిర్ణయం తీసుకున్నారు. వీళ్లు చేసే జిమ్‌లోనే దొంగతనానికి ప్లాన్ చేశారు. జిమ్‌కు వచ్చేవాళ్లు లాకర్ రూమ్‌లో బ్యాంకుల కార్డులు పెడుతారని గ్రహించారు. దీనినే తనకు అనుకూలంగా మార్చుకున్నారు. లాకర్ రూమ్ వద్ద వీళ్లు క్రెడిట్, డెబిట్ కార్డులు దొంగలించడం మొదలు పెట్టారు. సంవత్సరం కాలంలో 18 మంది దగ్గర కార్డులు దొంగతనం చేసి 2,50,000 యూరోల డబ్బులను దొచుకున్నారు. ఈ డబ్బులతో ప్రేమ జంట చక్కగా పారిస్, దుబాయ్, అమ్లిఫీ కోస్ట్ దేశాలలో ప్రయాణించి ఎంజాయ్ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసి కెమెరా అమర్చారు. సిసి కెమెరా ఆధారంగా దొంగలను గుర్తించి గాట్విక్ ఎయిర్‌పోర్టు వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు అశ్లేకు మూడేళ్ల జైలు శిక్ష, సోఫీకి 20 నెలల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News