Sunday, January 19, 2025

ప్రేమభిక్ష కోసం 21గంటలపాటు మోకాళ్లపై భగ్నప్రేమికుడి దీక్ష

- Advertisement -
- Advertisement -

 

 

న్యూస్‌డెస్క్: నీ దయ రాదా అంటూ ఒక భగ్నప్రేమికుడు తన మాజీ ప్రేయసి ప్రేమభిక్ష కోసం దాదాపు 21 గంటలపాటు ఆమె ఆఫీసు బయట మోకాళ్లపై కూర్చుని దీక్ష చేశాడు. భారీ వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఆ భగ్నప్రేమికుడు సాగించిన ప్రేమతపస్సు ఆమె మనసును కరిగించిందా లేదా అన్నది పక్కనపెడితే అక్కడకు చేరుకున్న వందలాది మందితోపాటు వేల సంఖ్యలో నెటిజన్లు అతడికి సంఘీభావం ప్రకటించడం విశేషం.

వాయువ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్సులోని బిజోవ్‌లో మార్చి 28న ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమె కార్యాలయం ఉన్న భవనం ప్రవేశ ద్వారం వెలుపల ఆ భగ్నప్రేమికుడి మోకాళ్లపై మౌనపోరాటం ప్రజల హృదయాలను కదిలించింది. మార్చి 28వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు చేతిలో పూలగుత్తి పట్టుకుని మోకాళ్లపై కూర్చున్న ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు అక్కడి నుంచి కదల్లేదు. 21 గంటలపాటు సాగిన అతని ప్రేమ దీక్షను వైబీలో దాదాపు 15 కోట్ల మంది వీక్షించారు.
విడిపోయిన తాము మళ్లీ కలిసిపోదామని, తన ప్రేమను తిరిగి స్వీకరించాలంటూ ఆ భగ్నప్రేమికుడు తన మాజీ ప్రేయసిని వేడుకోగా అతని చుట్టూ గుమికూడిన స్థానికులు మాత్రం ఈ ప్రయత్నాలు వేస్ట్ అంటూ అతనికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అతడు అక్కడే మోకాళ్లపై కూర్చున్న దృశ్యం స్థానికులను కదిలించివేసినప్పటికీ అతని మాజీ ప్రియురాలికి మాత్రం కనికరం కలగలేదు. ఆమె జాడ ఎక్కడా కానరాలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అతడికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించివేసేందుకు ప్రయత్నించారు. అయితే తాను చేస్తోంది చట్ట వ్యతిరేకమా అని అతను ప్రశ్నించడంతో పోలీసులు సైతం సమాధానం చెప్పలేకపోయారు. ఎంత సేపు వేచి ఉన్నప్పటికీ మాజీ ప్రేయసి కనికరించకపోవడం ప్రకృతి కూడా తనకు సహకరించకపోవడంతో చివరకు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మోకాళ్ల దీక్షకు ముగింపు పలికి ఆ భగ్నప్రేమికుడు ఇంటి ముఖం పట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News