Sunday, January 26, 2025

ప్రేమ పేరుతో వేధింపులు…. మంచిర్యాలలో యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్త మామిడిపల్లి గ్రామంలో రాజలింగం-రాజమణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె సాయిష్మా ఉంది. గత కొన్ని రోజుల నుంచి సాయిష్మాను అదే గ్రామానికి చెందిన వినయ్ కుమార్ వేధిస్తున్నాడు. సాయిష్మా మరొక యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో వినయ్ వేధింపులు శృతిమించాయి. తనని పెళ్లి చేసుకోవాలని లేకపోతే చంపేస్తానని పలుమార్లు యువతిని బెదిరించాడు. వినయ్ వేధింపులు తట్టుకోలేక యువతి పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News