Saturday, December 21, 2024

ప్రేమపెళ్లి చేసుకున్న దంపతులపై గొడ్డలితో దాడి

- Advertisement -
- Advertisement -

కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న యువతి మేనమామ.. అదును చూసి దాడి.. యువతి మేనమామపై కేసు నమోదు

Love marriage : father attack on groom

మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులో ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతుల పై అమ్మాయి మేనమామ గొడ్డలితో దాడికి పాల్పడాడు. ఘటనలో వివాహిత భర్త గాయపడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ గ్రామ పరిధిలోని సూర్మాయిగూడకు చెందిన గంగని శివకుమార్ (28) అదే గ్రామానికి చెందిన మైనారిటీ యువతిని 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం శివకుమార్, ఆయన భార్య చిన్న కుమారుడికి జ్వరం వస్తే హాస్పిటల్‌లో చూపించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ షాడో హాస్పిటల్ ముందు ఆటో స్టాండ్ వద్దకు రాగానే గంగని యువతి మేనమామ జహంగీర్ కోపంతో భార్యాభర్తలను కులం పేరుతో దూషిస్తూ ఒక్క సారిగా గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భర్త శివకుమార్ గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి గాయపడిన శివకుమార్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తన భర్త శివకుమార్ పై దాడికి పాల్పడిన మేనమామ జహింగీర్ పై చర్యలు తీసుకోవాలని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News