Wednesday, January 22, 2025

ప్రేమపెళ్లి… భయంతో ప్రాణాలు తీసుకున్నారు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ఇద్దరు ప్రేమించుకున్నారు… ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దేవాలయంలో వివాహం చేసుకున్నారు. యువతి మైనర్ కావడంతో పెద్దలు అడ్డు చెబుతారని ఆ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతం కొందుర్గు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(24) షాద్‌నగర్‌లోని ఓ కిరాణం దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాజేంద్రనగర్‌కు చెందిన బాలికతో (16) పరిచయం ఏర్పడడంతో ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 27న ఇరు కుటుంబ సభ్యులకు తెలియకుండా యాదగిరి గుట్టకు వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

మార్చి 30న సదరు యువతిని తీసుకొని శ్రీకాంత్ ఉత్తరాసిపల్లి గ్రామానికి వచ్చారు. ఇరు వైపుల పెద్దలు తరువాత మాట్లాడుదామని చెప్పి వెళ్లిపోయారు. యువతి మైనర్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి అడ్డుచెబుతారని భయపడ్డారు. శనివారం సాయంత్రం గ్రామ శివారులో విద్యుత్ సబ్ స్టేషన్‌కు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి కింద పడిపోయారు. వాహనదారుల గమనించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యుల వెంటనే వారని షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వారిని తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మార్చి 1న, శ్రీకాంత్ 2వ తేదీన చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News