Friday, December 27, 2024

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురికి శిరోముండనం

- Advertisement -
- Advertisement -

 

ఇటిక్యాల: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కూతురిపై తల్లిదండ్రులే కర్కశంగా ప్రవర్తించారు. ప్రేమ వివాహం చేసుకుందని కూతురికి తల్లిదండ్రులు శిరోముండనం చేశారు. పెళ్లైన ఏడు నెలల తర్వాత కూతుర్ని కిడ్నాప్ చేసి శిరోముండనం చేశారు. దీంతో ఆ యువతి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News