Saturday, December 21, 2024

పరువు హత్య… అల్లుడి కళ్లలో కారం చల్లి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నిమ్న కులానికి చెందిన యువకుడు తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అతడిని ప్రియురాలు తండ్రి హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బగల్‌కోట్ జిల్లాలో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జామ్‌కండి ప్రాంతం తక్కొండా గ్రామంలో బుజబాలా కర్జాగి అనే యువకుడు జైన్ కులానికి చెందిన వాడు నివసిస్తున్నాడు. క్షత్రియ కులానికి చెందిన భాగ్యశ్రీని ప్రేమించాడు. భాగ్యశ్రీ ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సంవత్సరం క్రితం పారిపోయి ప్రేమ జంట పెళ్లి చేసుకుంది.

తక్కువ కులానికి చెందిన వ్యక్తిని భాగ్య శ్రీ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో గ్రామంలో తన పరువు పోయిందని ఆమె తండ్రి తమనా గౌడ రగిలిపోయాడు. సంవత్సరం తరువాత భాగ్య శ్రీతో కలిసి బుజబాలా తన సొంతూరుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న గౌడ అల్లుడిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. డిసెంబర్ 17న బుజబాలా గ్రామంలో హనుమాన్ గుడి నుంచి వెళ్తుండగా గౌడ అతడి కళ్లలో కారం చల్లాడు. అనంతరం కత్తులతో విచాక్షణరహితంగా దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో మరో ఇద్దరి హస్తం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News