Friday, January 24, 2025

లవ్, మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ

- Advertisement -
- Advertisement -

తండ్రీ, కొడుకుల మధ్య జరిగే రైవల్రీ కథే ‘లోకమెరుగని కథ’. సుజాత సమర్పణలో క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజిత హీరోయిన్. రవికాంత్ జమి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ “నిర్మాత రవికాంత్ జమికి నేను చెప్పిన కథ నచ్చడంతో మేము కొత్తవారిమైనా మమ్మల్ని నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా విషయానికి వస్తే… ఇది ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు నడుచుకునే కొడుకుల మధ్య వినూత్న స్క్రీన్‌ప్లేతో జరి గే రైవల్రీ కథే ఈ సినిమా”అని అన్నారు. ఈ కా ర్యక్రమంలో పూజిత, శ్రీకాంత్ కొప్పుల, విజయ్ విశ్వనాధన్, ప్రసాద్ తుమ్మల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News