Wednesday, January 22, 2025

కత్తి దూసిన ప్రేమ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో/ఎల్‌బినగర్: వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని ప్రేమోన్మాది యువతిపై దాడి చేయడమే కాకుండా అడ్డువచ్చిన ఆమె సోదరుడిని కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ దారుణమైన సంఘటన ఎల్‌బినగర్, ఆర్‌టిసి కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువతిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చే యిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కుందుర్గు మండల కేంద్రానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరా దంపతులకు కుమారై సంఘవి (24), కుమారుడు పృథ్వీ (21) ఉన్నారు. అక్క సంఘవి, తమ్ముడు పృథ్వీ ఎల్‌బి నగర్‌లోని ఆర్‌టిసి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు. సంఘవి రామంతాపూర్‌లోని హోమియో వైద్య కళాశాలలో మెడిసిన్ నాలుగో ఏడాది చదువుతుండగా, పృథ్వీ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.

సంఘవి రామంతపూర్‌కు చెందిన శివకుమార్ గతకొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు శివకుమార్, సంఘవి ఉంటున్న ఇంటికి వచ్చాడు. ఆ స మయంలో ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు పృ థ్వీ అలియాస్ చింటూ ఉన్నారు. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్న తరుణంలో వివాహం చేసుకుందామని శివకుమార్ సంఘవిని కోరాడు. దాని కి ఆమె నిరాకరించడంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన నిందితుడు అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో శివకుమార్, సంఘవిపై ఒక్కసారిగి దాడికి దిగాడు. కత్తితో సంఘవి ముఖం, చేతులపై దాడిచేయడంతో అడ్డువచ్చిన పృథ్వీపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ముగ్గురి మధ్య జరిగిన పెనుగులాటతో కిటికీ అద్దాలు… స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీ కిందపడిపోయి ఉన్నారు. వెంటనే స్థానికులు నిందితుడి ని రూమ్‌లో వేసి బంధించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే పృథ్వీ మృతిచెందినట్లు తెలిపారు. సం ఘవిని పోలీసులు మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పృథ్వీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడి చేసి హత్య చేసిన నిందితుడిని ఎల్‌బి నగర్ పోలీసులు పిఎస్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ పరిశీలించారు. ప్రేమ వ్యవహారమే సంఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సంఘవి కోలుకున్న తర్వాత గొడవకు గల కారణాలు తెలుస్తాయని డిసిపి సాయిశ్రీ తెలిపారు. నిందితుడు శివకుమార్‌ను విచారిస్తున్నామని, అతడి నేరచరిత్రపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News