Wednesday, January 22, 2025

లవ్ యు మై డియర్ డా.రామ్‌చరణ్

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు డాక్టరేట్ దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. తమిళ నా డులోని ప్రసిద్ధ వేల్స్ విశ్వవిద్యాలయం రామ్‌చరణ్‌కి గౌరవ డాక్ట రేట్ ప్రదానం చేయడం నన్ను ఒక తండ్రిగా భావోద్వేగానికి గురిచే సింది. అందుకు నేను గర్వంగా భావిస్తున్నాను. ఇది ఒక ఉత్తేజ కరమైన క్షణం. మన సంతానం వారి విజయాలతో మనల్ని అధిగమించి నప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకి ఎదగాలి, లవ్ యు మై డియర్ డా.రామ్ చరణ్ అని చిరు తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. రామ్ చరణ్‌కు కుటుంబస భ్యులతో పాటు అభిమానులు కూడా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శక త్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తు న్నారు. ఈ చిత్రం షూటింగ్ పనులను శరవే గంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News