Monday, December 23, 2024

పెళ్లికి నో చెప్పినందుకు బాలికపై యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పెళ్లి చేసుకోనని చెప్పినందుకు 17 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం రామనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుమంత్ అనే యువకుడు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. 17 ఏళ్ల బాలికను ప్రేమించాలని వెంటపడ్డాడు. ప్రేమ పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో బాలిక తిరస్కరించింది. వెంటనే యాసిడ్ బాటిల్ తీసుకొని ఆమెపై చల్లాడు. ఆమె ఎడమ కన్నుపై యాసిడ్ పడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధితురాలు కుటుంబంతో మాట్లాడి నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News