Friday, December 20, 2024

ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు బ్లేడ్‌తో కోసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజవర్గం తాటిపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గూడపల్లి గ్రామంలో కటికిరెడ్డి కృష్ణ గణేష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. తాటిపాకకు చెందిన వివాహితతో కృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. డిసెంబర్ 17 రాత్రి సమయంలో భర్త లేకపోవడంతో కృష్ణను ప్రియురాలు ఇంటికి పిలిచింది. కృష్ణకు మరికొంత మంది మహిళలతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో పడక గదిలో ఏకాంత సమయంలో బ్లేడ్‌తో అతడిపై దాడి చేసింది. మర్మాంగాన్ని బ్లేడ్‌తో కోసింది. బాధితుడు అరుపులు కేకలు వేయడంతో అతడిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News