Sunday, January 19, 2025

యువతిపై ప్రేమోన్మాది దాడి….

- Advertisement -
- Advertisement -

యువతి చేతులు గొంతుపై కత్తితో గాయాలు…

హైదరాబాద్: యువతిపై ప్రేమోన్మాది ఘాతకానికి పాల్పడిన సంఘటన షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట్ రోడ్ రతన్ కాలనీలో జరిగింది. యువతిపై యువకుడు కత్తితో దాడి చేయడంతో మెడ చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి మేడపై యువతి బట్టలు ఆరేస్తుండగా యువకుడు ఒక్కసారిగా మేడపైకి వచ్చి యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతి భయంతో కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన యువతిన స్థానికులు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు యువతికి ప్రథమ చికిత్స చేసి అనంతరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. యువతి యువకుడ ప్రేమలో ఉన్నారని ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెపై యువకుడు దాడి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News