Monday, December 23, 2024

యువతిపై ప్రేమోన్మాది దాడి…

- Advertisement -
- Advertisement -

నల్గొండ: ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. కడుపులో, చేతిపై, కాళ్లపై, మొఖంపై విచక్షణా రహితంగా పొడిచాడు. నల్గొండ పట్టణ శివార్లలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ అనే యువకుడు ఆమెపై దాడిచేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News