Sunday, December 22, 2024

గచ్చిబౌలిలో దారుణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గచ్చిబౌలి : గచ్చిబౌలిలో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన ఘటనలో యువతి మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధి లో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. సిఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెం దిన దీపన తమాంగ్ (25) నగరానికి వచ్చి గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలో తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటూ, నల్లగండ్ల అపర్ణలో బ్యూటీషియన్‌గా పనిచేస్తుంది. ఆమెకు గత కొంత కా లం క్రితం కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన రాకేష్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే రాకేష్ తనను పెళ్లి చేసుకోవాలంటూ దీపన తమాంగ్ విసిగించేవాడు.

కాగా ఆమె పెళ్లికి నిరాకరి స్తూ కొంత కాలంగా అతన్ని దూరం పెట్టింది. వేరే వారితో సన్నిహితంగా ఉంటూ తనని దూరం పెడుతుందనే అనుమానం రాకేష్‌లో మొదలైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్ ఆమెతో మ రోసారి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాకేష్ క్షణికావేశంలో అక్కడే ఉన్న కూరగాయల కత్తితో యువతి పై దాడి చేశాడు. దాడిని అడ్డుకోవడానికి దీపన తమాంగ్ ముగ్గురు స్నే హితురాళ్లు ప్రయత్నించగా రాకేష్ వారిపై కూడా దాడికి యత్నించాడు. ఈ దాడిలో దీపన తమాంగ్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆ మెను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె స్నేహితురాళ్లకు సైతం గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.

కాగా యువతిని కత్తి తో పొడిచి అనంతరం అక్కడి నుంచి పారిపోయిన రాకేష్ మెయినాబాద్ సమీపంలో కనకమామిడి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరెంట్ పోల్ ఎక్కడానికి ప్రయత్నించగా.. విద్యుత్ షా క్‌తో గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రాకేష్‌ను కనకమామిడి సమీపంలోని ఓ ప్రైవేటు హస్పిటల్‌కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమో దు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స అనంత రం హాస్పిటల్ నుండి వచ్చాక రాకేష్‌ను అరెస్ట్ చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News