Saturday, January 11, 2025

యువతిపై బ్లేడుతో దాడి చేసిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

అమరావతి: యువతిపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి వడ్డేశ్వరంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు సంవత్సరాల నుంచి నర్సుగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో చర్చికి వచ్చి మళ్లీ హాస్టల్‌కు వెళ్లింది. బందరు ప్రాంతంలోని క్రోసూరుకు చెందిన క్రాంతి మౌళి గత కొంత కాలంగా సదరు యువతిని ప్రేమించాలని వెంటపడుతున్నాడు. పలుమార్లు అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. ఆమెకు ఫోన్ చేసి హాస్టల్ నుంచి బయటకు రావాలని యువతిని క్రాంతి కోరాడు. ఆమె బయటకు రాగానే యువతి మెడపై బ్లేడ్‌తో కోశాడు. ఇద్దరు మధ్య తోపులాట జరుగుతుండగా అతడిని పక్కకు నెట్టేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రేమోన్మాదిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News