Monday, December 23, 2024

పెళ్లి చేసుకోలేదని ప్రియురాలిని హత్య చేసి…. తలతో పోలీస్ స్టేషన్ కు

- Advertisement -
- Advertisement -

Lover beheads ex-girlfriend

బెంగళూరు: పెళ్లికి నిరాకరించిందని యువతిని హత్య చేసి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం విజయనగర జిల్లా కుడ్లిగి ప్రాంతంలో జరిగింది. కన్నిబొరయ్య హట్టిలో బోజరాజు అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బసవణ్ణ కుమార్తె నిర్మల అనే యువతి(21) బిఎస్‌సి నర్సింగ్ చదువుతోంది. ఆమెను ప్రేమిస్తున్నాని పలుమార్లు వెంటపడ్డాడు. గత రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు నుంచి ప్రేమించుకున్నట్టు సమాచారం. ఒక రోజు నిర్మల ఇంటికెళ్లి పెళ్లి చేసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో రెండు నెలల క్రితం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో సెలవులు రావడంతో నిర్మల సొంతూరుకు వచ్చింది. గురువారం మధ్యాహ్నం నిర్మల ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి భోజరాజు వెళ్లాడు. నిర్మలతో అతడు గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకెళ్లి ఆమె తలను నరికేశాడు. మృతదేహం నుంచి తలను వేరుచేసి సంచిలో వేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఆమె మరో యువకుడితో ప్రేమలో పడడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిందితుడు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News