Thursday, December 19, 2024

లవర్‌ను కెనడా నుంచి ఇండియాకు రప్పించి… పొలంలో పాతిపెట్టి… 10 నెలల తరువాత దొరికాడు…

- Advertisement -
- Advertisement -

 

ఛండీగఢ్: గత సంవత్సరం జూన్‌లో తన లవర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కెనడా నుంచి ఇండియాకు పిలిపించుకొని ఆమెను తుపాకీతో కాల్చి చంపి అనంతర మృతదేహాన్ని తన ఫామ్‌హౌస్‌లో పాతిపెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రం భివాణి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నీలమ్ అనే యువతికి సునీల్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నీలమ్ ప్రస్తుతం కెనడాలో నివసిస్తోంది. గత సంవత్సరం జూన్‌లో మద్యం మత్తులో సునీల్ పెళ్లి చేసుకుంటానని నీలమ్‌కు ఫోన్‌లో చెప్పి ఇండియాకు రమ్మని కబురు పంపాడు. వెంటనే కెనడా నుంచి ఇండియాకు వచ్చి సునీల్ ను కలిసింది. అప్పటి నుంచి ఆమె కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హర్యానాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసినప్పటికి ఆమె గురించి వివరాలు బయటకు రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు హర్యానా హోంమంత్రి అనిల్ విజ్‌ను కలిసి తన కూతురు నీలమ్ కనిపించడం లేదని తెలిపారు. ఈ కేసును క్రైమ్ ఇన్వస్ట్‌గేషన్‌కు అప్పగించడంతో సునీల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తాను తుపాకీతో ఆమెను కాల్చి చంపి అనంతరం తన పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టానని చెప్పాడు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకొని అస్థిపంజరం స్వాధీనం చేసుకున్న శవ పరీక్షల నిమిత్తం సోనిపేట్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సునీల్‌పై గతంలో హత్యాయత్నం, అక్రమ ఆయుధాలు కేసులు అతడిపై ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News