Thursday, January 23, 2025

వధువు నుదుట సిందూరం పెట్టిన ప్రియుడు… పెళ్లి రద్దు

- Advertisement -
- Advertisement -

 

లక్నో: పెళ్లి వేడుకలో వధువు నుదుట ప్రియుడు సిందూరం పెట్టడంతో పెళ్లి రద్దైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గాజిపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. సదరు యువతికి మరో గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. వివాహం జరగుతున్న మండపానికి ప్రియుడు చేరుకొని వధువు నుదటపై సిందూరం దిద్దాడు. దీంతో వెంటనే వరుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు. ప్రియుడు పారిపోతుండగా గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. గతంలో అతడు సదరు యువతి వివాహాన్ని రద్దు కావడానికి కారణమయ్యాడని తెలుస్తుంది.

Also Read: ఒక పక్క ఎండలు.. మరో వైపు జల్లులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News