Wednesday, January 22, 2025

ప్రియురాలు ఆత్మహత్య… ప్రియుడు రైలు కిందపడి…

- Advertisement -
- Advertisement -

Love Couple commit suicide in Bapatla

సికింద్రాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దూరంకావడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియుడి కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని మౌలాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటకకు చెందిన దంపతులు వెంకటేష్-మంగమ్మ నేరెడ్‌మెట్‌లోని వినాయక్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు శ్రీకాంత్ అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాంత్ ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నాడు. రాజేంద్రనగర్ చెందిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో పరిచయం కావడంతో ఇద్దరు మధ్య ప్రేమకు దారితీసింది. యువతి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

వివాహ వయసు 21 ఏళ్లు కావడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు అప్పజెప్పారు. దీంతో ప్రియుడి లేని జీవితం వ్యర్థం అనుకొని సోమవారం యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రియుడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. బుధవారం టిఫిన్ చేస్తానని చెప్పి సోదరి దగ్గర రూ.500 రూపాయలు తీసుకొని శ్రీకాంత్ బయటకు వెళ్లాడు. వివేకానగర్‌లో టిఫిన్ చేస్తుండగా గూడ్స్ రైలును గమనించాడు. వెంటనే అక్కడి నుంచి పరుగు తీసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News