Thursday, January 23, 2025

రూ.4.5 లక్షల ఖర్చు… వసూలు చేయండి…. ప్రియుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: ప్రేమించింది, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె పెట్టిన ఖర్చులను లెక్క రాసి వసూలు చేయాలని లేఖ రాసిన సంఘటన కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంకరపుర గ్రామానికి చెందిన చేతన్ అనే యువకుడు తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. సరుకు రవాణా వాహనాన్ని నడపుతూ చేతన్ జీవనం సాగించేవాడు. వచ్చిన ఆదాయం మొత్తం ఆమెకే ఖర్చు పెట్టేవాడు. చేతన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రియురాలు నిరాకరించింది. దీంతో జీవితంపై విరక్తి చెంది అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె కోసం 4.5 లక్షల రూపాయలు ఖర్చు చేశానని, మొత్తం వసూలు చేయాలని ఓ బుక్‌లో రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News