Monday, December 23, 2024

ప్రేమికురాలి ఇంటి ఎదుట యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగరంలో విషాదం

మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట : ప్రేమించిన బాలికతో వివాహం జరిపించేందుకు నిరాకరించారని తీవ్ర మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఏకంగా ఆ బాలిక ఇంటి ముందే డీజిల్ ఒంటిపై చల్లుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన శనివారం రాత్రి ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అదనపు ఇన్‌స్పెక్టర్ కె.ఎస్.రవి, బాధితుల కథనం ప్రకారం… మైలార్‌దేవ్‌పల్లి సోఫియా కాలనీకి చెం దిన మహ్మద్ అన్వర్ చిన్న కుమారుడు మహ్మద్ జమాల్ (21) గత నాలుగేళ్ళుగా ఫలక్‌నుమా వట్టేపల్లిలోని ప్రేమికురాలి తండ్రి వద్ద దర్జీ (టైలర్)గా పనిచేస్తున్నాడు. ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగర్ లో ఉండే యజమాని తన ఇంటికి జమాల్‌తో సరుకులు పంపించేవాడు.

ఈ క్రమంలో యజమా ని కూతురు (16)తో పరిచయం ఏర్పడి అది ప్రేమ గా మారింది. గత మూడు నెలల కిందట పనిమా నేసిన జమాల్ ఆ బాలికతో వివాహం జరిపించా లని తల్లితో కలిసి ఆమె కుటుంబ సభ్యుల వద్ద ప్రతిపాదన తెచ్చాడు. అందుకు వారు నిరాకరిం చడంతోపాటు బాలిక ఇంటర్మీడియట్ చదువుతుందని, బంధువుల యువకుడితో వివాహం జరిపిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ బాలికతో వివాహం జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి బాలిక తండ్రి, జమాల్ సోదరుడు హర్షద్‌ను పిలిచి ఒక హోటల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో డీజిల్ డబ్బా, గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌తో ఆ బాలిక కుటుంబం నివసిస్తున్న భవ నం రెండో అంతస్థులోకి జమాల్ చేరుకున్నాడు. తాను ఇష్టపడిన బాలికతో పెళ్ళి జరిపించాలని లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయి నా వారు తలుపులు తెరవకపోవటంతో ఒంటిపై డీజిల్ చల్లుకుని గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఓపెన్ చేసి లైటర్‌తో నిప్పంటించుకున్నాడు.

దీంతో జమా ల్‌కు మంటలు అంటుకొని కాలిపోతుం డటంతో వెంటనే ఆ బాలిక తన తండ్రికి ఫోన్ చేసింది. దీం తో ఇరువురు హుటాహుటిన అక్కడికి చేరుకునే సరికి జమాల్ మంటలకు తాళలేక పరిగెడుతూ రెండో అంతస్థు మెట్ల మార్గంలో పడిపోయాడు. ఆ సమయంలో అతని తలకు బలమైన గాయాలైయ్యాయి.వారు వెంటనే జమాల్‌ను ఉస్మానియాకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News