Sunday, December 22, 2024

మణికట్టు కోసుకున్న ప్రియురాలు… ఆగిన ప్రియుడి గుండె

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రియురాలు మణికట్టు వద్ద నరాలు కోసుకొని రక్తపు మడుగులో కనిపించడంతో ప్రియుడు స్పృహ తప్పి పడిపోయి మృతి చెందిన సంఘటన ఢిల్లీలోని జగన్‌పురిలో జరిగింది. యువతి పరిస్థితి కూడా విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. యువతి లా చదువుతుండగా యువకుడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో యువతి తన ప్రియుడికి వీడియో కాల్ చేసి పదునైన ఆయుధంతో మణికట్టు నరాలు కోసుకొంది. వెంటనే అతడు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను కైలాశ్ దీపక్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన వెంటనే ఆమె రక్తపు మడగులో కనిపించడంతో స్పృహ తప్పిపోయాడు. వెంటనే వైద్యులు పరీక్షించగా మృతి చెందినట్లు వెల్లడించారు. భయంతో గుండె ఆగిపోవడంతోనే అతడు మృతి చెంది ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. శవ పరీక్ష నివేదిక వచ్చిన తరువాత అసలు విషయం తెలుస్తుందని వైద్యులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News