Friday, December 20, 2024

ప్రియుడికి షాక్…. ప్రియుడి తండ్రితో పారిపోయిన యువతి

- Advertisement -
- Advertisement -

ప్రేమికులు కుల, మత, వయసు, ప్రాంతం తేడాలు లేకుండా ప్రేమించుకుంటారు. ఒకనొక సమయంలో ప్రేమ గుడ్డిదని అంటారు.. అది నిజమే కావొచ్చు కాబోలు… ఓ యువకుడు యువతిని ప్రేమించాడు… పెళ్లి చేసుకోవాలని యువకుడు తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ ఇంతలోనే యువతి తన ప్రియుడి తండ్రితో పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కంజూశి గ్రామానికి చెందిన కమలేశ్ కుమార్ తాపీ మేస్త్రీ పని చేసుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కమలేష్ తన కుమారుడు అమిత్‌తో కలిసి 2022లో చకేరి పోలీస్ స్టేషన్‌లో భవనం నిర్మాణాల పనులు చేపట్టాడు. అమిత్ ఓ యువతి ప్రేమలో పడడంతో తండ్రి గుర్తించి పలుమార్లు మందలించాడు. కుమారుడు బయటకు రాకుండా ఇంట్లోనే బంధించాడు.

Also Read: పెళ్లి మండపంలో వధువు, వరుడిపై యాసిడ్ దాడి…. పది మందికి గాయాలు

అమిత్ తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడేవాడు. తన కుమారుడి ప్రేమకు తండ్రి అంగీకారం తెలపడంతో అమిత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీన్ కట్ చేస్తే…  యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమిత్ తన ప్రియురాలు కోసం వెతకని చోటు అంటూ లేదు. ఎక్కడ వెతికిన ఆమె కనిపించలేదు. తాజాగా పోలీసులు ఆమె ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లారు. సదరు యువతి కమలేశ్‌తో ఉండడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. కమలేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతికి వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కమలేశ్ ను కూడా ప్రేమించానని యువతి పోలీసులకు చెప్పింది. అమిత్‌ను కలుసుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు కమలేశ్ తో పరిచయం ఏర్పడడంతో అతడితోనూ ప్రేమాయణం జరిపానని వివరించింది. తండ్రి, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని కోర్టులో హాజరుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News