- Advertisement -
కోలార్ న్యూస్ : ప్రేమజంట పారిపోయింది… ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రేయసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో నంగలి పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెన్నెల(22), చంద్ర శేఖర్ అనే యువతి యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమ జంట కొన్ని రోజుల క్రితం పారిపోవడంతో ఇద్దరిని తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ పెట్టగా తాను పెళ్లి చేసుకోనని ప్రియుడు చెప్పాడు. ప్రియుడి చేతిలో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు వెంటనే వెళ్లి గ్రామ శివారులో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. చంద్రశేఖర్, అతడి తల్లిదండ్రలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -