Monday, December 23, 2024

పెళ్లి చేసుకోమని అడిగినందుకు… ప్రియురాలి ముఖంపై కాలితో తన్ని…

- Advertisement -
- Advertisement -

భోపాల్: ప్రియుడ్ని ప్రియురాలు పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఆమెపై అతడు పిడిగుద్దులు కురిపించడంతో పాటు కిందపడేసి ముఖంపై కాలుతో తన్నిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మౌగంజ్ ప్రాంతంలో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి నిర్మానుష్య పదేశానికి వచ్చాడు. గర్ల్‌ఫ్రెండ్ తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోమని కోరింది. కోపంతో ఊగిపోయిన ప్రియుడు ఆమె చెంప చెల్లుమనిపించాడు. అనంతరం జట్టు పట్టుకొని కిందపడేసి ముఖంపై పలుమార్లు కాలుతో తన్నాడు. అతడి కౄరత్వాన్ని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. దయాదాక్షిణ్యాలు లేకుండా విచక్షణ రహితంగా దాడి చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు. అనంతరం ఆమెను పైకి లేపి ప్రియుడు పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు 151, 323 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రియురాలు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News