Monday, December 23, 2024

జ్యూస్‌లో విషం కలిపి ప్రియుడ్ని చంపిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

Lover killed boy friend with poison

తిరువనంతపురం న్యూస్: విడిపోవడానికి ప్రియుడు అంగీకరించకపోవడంతో అతడికి ప్రియురాలు విషం ఇచ్చి చంపిన సంఘటన కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీష్మా(22), షరోన్(23) గాఢంగా ప్రేమించుకున్నారు. గత కొంత కాలంగా షరోన్‌తో గ్రీష్మా చనువుగా ఉండడం లేదు. ఆమెను మరిచిపోలేక ఆమె వెంట షరోన్ పలుమార్లు పడ్డాడు. గ్రీష్మాకు అమెరికాలో ఉన్న వ్యక్తితో పెళ్లి నిశ్చయంతో కావడంతో తనని మరిచిపోవాలని ప్రియుడికి సూచించింది. మరిచిపోలేనని ప్రియురాలితోనే కలిసి ఉంటానని అతడు ఆమెకు తెలిపాడు. దీంతో ప్రియుడ్ని చంపాలని ప్రియురాలు నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు తన ఇంటికి ప్రియుడ్ని పిలిచింది. జ్యూస్‌లో విషం కలిసి అతడికి ఇచ్చింది. అతడు తాగిన వెంటనే అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియుడు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Lecturer who ran away with student in tamil nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News