Friday, December 20, 2024

ప్రియురాలిని చంపి… కనపడడంలేదని పిఎస్ లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పెళ్లి విషయంలో గొడవ జరగడంతో ప్రియురాలిని ప్రియుడు హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి పారిపోయిన సంఘటన ఢిల్లీలోని ఫార్ష్ బజార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుల్తాన్ అనే వ్యక్తి డెలవరీ, ప్యాకేజీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శ్యామా అనే యువతి తన మాజీ బాయ్ ఫ్రెండ్ ద్వారా ఆమెకు సుల్తాన్ పరిచయమయ్యాడు. శ్యామా తన కుటుంబ సభ్యులతో ఫార్ష్ బజార్‌లో నివసిస్తూ ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తుంది. ఆమె కనిపించడంలేదని తెలిసి వెంటనే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్థానికల పోలీస్ స్టేషన్‌లో సుల్తాన్ ఫిర్యాదు చేయడంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశ్వాస్ నగర్‌లో సుల్తాన్ ఆఫీస్‌లో మృతదేహం కనిపించడంతో స్థానికుల సహాయంతో పోలీసులకు సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తలపై బలమైన గాయాలతో పాటు క్లాత్‌తో గొంతు నులిమి చంపిన అనవాళ్లు పోలీసులకు కనిపించాయి.

సుల్తాన్ ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో పాటు అతడు ముంబయిలోని ములంద్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని పట్టుకున్నారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి శ్యామ తెలుసునని, వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, శ్యామ ఇంటికి అప్పుడప్పుడు సుల్తాన్ వెళ్తుండేవాడు. ఆమె కుటుంబ సభ్యులతో కూడా సుల్తాన్‌కు పరిచయం ఉంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి.

గొడవలు గురించి మాట్లాడుకుందామని ఆమెను ఆఫీస్‌కు రమ్మని కబురు పంపాడు. ఆఫీస్‌కు వచ్చిన తరువాత ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను హత్య చేసి అనంతరం రెండు చేతులు కాళ్లు కట్టి ఓ ప్లాసిక్ బ్యాగ్‌లో మూట కట్టి ఆఫీస్‌కు తాళం వేశాడు. అనంతరం వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి ముంబయిలో ఉండడంతో సుల్తాన్ అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత జాబ్ కోసం వచ్చానని వివరణ ఇచ్చాడు. పోలీసులు అతడిని అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News