Sunday, January 19, 2025

నలుగురు ప్రియులతో కలిసి మరో ప్రియుడి హత్య

- Advertisement -
- Advertisement -

పాట్నా: ప్రియురాలు నలుగురు ప్రియులతో కలిసి మరో ప్రియుడ్ని హత్య చేసిన సంఘటన బిహార్ రాష్ట్రం నలందా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పిను దేవీ(30) అనే మహిళ చాయ్ దుకాణం నిర్వహిస్తుంది. ఆమెకు భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. కృష్ణానందన్(75), లోహాసింగ్(62), వాసుదేవ్ పాశ్వాన్(63), సూర్యామణి(60) అనే వృద్ధులు ఆమె టీ దుకాణంలో చాయ్ తాగేవారు. ఆమె వారితో చనువుగా ఉండడంతో నలుగురితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. తృపిత్ శర్మ(75) అనే వృద్ధుడు కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

మిగితా నలుగురు తృపిత్ శర్మతో వివాహేతర సంబంధం వద్దని ఆమెను హెచ్చరించారు. దీంతో తృపిత్ శర్మను హత్య చేయడానికి నలుగురు ప్రియులతో కలిసి ప్రియురాలు ప్లాన్ వేసింది. తృపిత్ శర్మను ఇంటికి పిలిచి అనంతరం అతడిపై నలుగురు ప్రియులు రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని మరుగుదొడ్డి ట్యాంక్‌లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తృపిత్ శర్మ కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి గ్రామస్థుల సమాచారం మేరకు పిను దేవీని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా మర్డర్ కేసులు వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News