Wednesday, December 25, 2024

ముగ్గురు పిల్లల తల్లి… పెళ్లి చేసుకోమని ఒత్తిడి.. 35 సార్లు కత్తితో పొడిచి

- Advertisement -
- Advertisement -

పుణే: ఓ వివాహిత తన ప్రియుడిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు ఆమెను అతడు 35 సార్లు కత్తితో పొడిచి చంపిన సంఘటన మహారాష్ట్రాలో జరిగింది. ఈ దారుణ హత్య పోలీసులు దర్యాప్తు చేయడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుణేలో రూపాంజలి అనే వివాహిత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. జయరామ్ అనే వ్యక్తితో రూపాంజలి వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన భర్తను వదిలేసి జయరామ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. జయరామ్‌ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకరావడంతో హత్య చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు.

ప్లాన్‌లో భాగంగా ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తన స్నేహితుడి సహాయంతో 35 సార్లు కత్తితో పొడిచాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం రూపాంజలిది అని తెలియడంతో ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. సూరజ్, జయరామ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News