Tuesday, January 21, 2025

మెడికల్ విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమోన్మాది చేతిలో మెడికల్ విద్యార్థిని బలైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తపశ్విని అనే దంత విద్యార్థిని ఓ మెడికల్ కాలేజీలో బిడిఎస్ చదువుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జ్ఞానేశ్వర్ అనే యువకుడు పరిచయం కావడంతో ప్రేమలో పడింది. ఆమె కోసం హైదరాబాద్‌లో ఉన్న అతడు ఆంధ్రాకు వెళ్లాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమకు గుర్తుగా అతడికి ఐవాచ్, బైక్ గిప్ట్‌గా ఇచ్చింది. కానీ ఇద్దరు మధ్యల మనస్పర్థలు రావడంతో బైక్, ఐవాచ్ ఇవ్వాలని అతడిని అడిగింది.

అతడు ఐవాచ్ ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. ఆమెకు పలుమార్లు జ్ఞానేశ్వర్ పోన్ చేసిన స్పందించలేదు. దీంతో పగ పెంచుకున్నాడు.తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఐవాచ్ ద్వారా ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. వెంటనే అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. బ్లేడు తీసి కడుపులో పొడిచి తన పెళ్లి చేసుకుంటావా? లేదా చంపేయలానా? అని అడిగాడు. చంపితే చంపేయ్ కానీ పెళ్లి చేసుకోనని చెప్పడంతో వెంటనే గొంతు కోశాడు. పక్కనే ఉన్న స్నేహితురాలిని ప్రశ్నించగా షాక్‌లో ఆమె ఏమీ చెప్పలేకపోయింది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు జ్ఞానేశ్వర్‌ది కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండగా గుర్తించారు. బిటెక్‌లో ఫెయిల్ కావడంతో క్రికెట్ బెట్టింగ్, గంజాయికి అలవాటు పడి అవారాగా తిరుగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News