Wednesday, January 22, 2025

ప్రేమించుకున్నారు… మాట్లాడడంలేదని యువతిని కత్తితో పొడిచాడు…

- Advertisement -
- Advertisement -

చెన్నై: తాను ప్రేమించిన అమ్మాయి తనని దూరం పెట్టడంతో ఆమెను కత్తితో పొడిచిన సంఘటన తమిళనాడు రాష్ట్రం సుందరాపూరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్ శ్రీరామ్ అనే యువకుడు బికామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో అమ్మాయితో లవ్‌లో పడ్డాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో కలిసి తిరిగారు. గత కొన్ని రోజుల నుంచి శ్రీరామ్‌కు యువతి దూరంగా ఉంటుంది. ఫోన్ చేసిన కూడా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్నాడు. ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లాడు.

ఆమె ఆఫీసులో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని, తనని ఎందుకు దూరంగా పెట్టావని ప్రశ్నించారుడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో జేబులో నుంచి కత్తి తీసుకొని ఆమెపై దాడి చేశాడు. పలుమార్లు పొడవడంతో ఆమె కేకలు వేసింది. వెంటనే కంపెనీ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి శ్రీరామ్ తప్పించుకున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News