Wednesday, December 25, 2024

ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… సుద్ధాల గ్రామానికి చెందిన ఓ యువకుడు, మరో గ్రామానికి చెందిన యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రియుడు మరో పెళ్లికి రెడీకావడంతో అతడి ఇంటి ముందు యువతి ధర్నాకు దిగింది. ధర్నా చేస్తున్న యువతిపై యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి దిగారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గ్రామానికి చేరుకొని యువతిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇద్దరు మధ్య ప్రేమపెళ్లి జరిగి ఉంటే ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News