Thursday, January 23, 2025

ప్రియురాలి నిశ్చితార్థం… పెట్రోల్ పోసుకొని ప్రియుడు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ప్రియురాలికి నిశ్చితార్థం జరగడంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన తేజ అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. ఓజిలి మండలానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. సదరు యువతి నిశ్చితార్థం జరుగుతున్న విషయం తెలుసుకొని ఆ గ్రామానికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న ప్రియురాలిని పిలిచిన రాకపోవడంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు స్పందించి వారిని గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News